Kishan Reddy: మోడీ వస్తున్నారు.. మహబూబ్ నగర్, నిజామాబాద్ లో పర్యటిస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: అక్టోబర్ 1న మహబూబ్ నగర్ కు, అక్టోబర్ 3న నిజామాబాద్ కు ప్రధాని మోడీ వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రైల్వేస్టేషన్ ల అభివృద్ది కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఎయిర్ పోర్టు మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ ఏర్పడుతుందని తెలిపారు. నాంపల్లి స్టేషన్ అధినికరణ ప్రారంభం అయిందని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రైల్వే రంగంలో అత్యాధునిక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. దేశంలో వందలాది రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. ఒకే రోజు తొమ్మిది రైళ్ళను ప్రధాని ప్రారంభిస్తున్నారని అన్నారు. రవాణా రంగంలో దేశీయ టెక్నాలజీతో ముందుకు పోతున్నామన్నారు. దేశీయ టెక్నాలిజీతో వందే భారత్ ట్రైన్ లను తయారు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే రెండు వందే భారత్ ట్రైన్ లు నడుస్తున్నాయని, ఇది మూడోది అని తెలిపారు.
సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు వందే భారత్ ట్రైన్ లను ఇవ్వడం జరిగిందన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మూడోవ ట్రైన్ ను ప్రారంభిస్తున్ననoదుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల తరుపున ప్రధాని మోడీకి, రైల్ వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. 12 జిల్లాల మీదుగా, మూడు రాష్ట్రాలను టచ్ చేస్తూ ఎనిమిదిన్నర గంటల్లో బెంగళూర్ కు చేరుకుంటుందని తెలిపారు. రెండు ఐటీ రంగంలో వేగంగా దూసుకు పోతున్న రెండు నగరాల మధ్య ట్రైన్ ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అక్టోబర్ 1, 3వ తేదీల్లో మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు.. కీలక అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. రైల్వే అభివృద్ధికి 4418 కోట్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రైల్ వే స్టేషన్ ల అభివృద్ధికి 2500 కోట్లు మోడీ ప్రభుత్వం కర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లను ఆధునీకరించబోతున్నామని తెలిపారు.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
చర్లపల్లిలో 220 కోట్లతో నూతన రైల్వే టెర్మినల్ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే మోడీ చేతుల మీదుగా ప్రారంభించ బోతున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వరంగల్ రైల్వే వాగన్ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హాయoలో దక్షిణాదిలో రైల్వే నెట్ వర్క్ అంశంలో నిర్లక్షం జరిగిందన్నారు. దాన్ని అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. వందే భారత్ ట్రైన్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. మోడీ హయంలోనే లక్ష యాభై కోట్లతో రోడ్డు కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయన్నారు. RRR రింగ్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. RRR రోడ్డు పూర్తి అయితే హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతోందని అన్నారు. హైదరాబాద్ రాబోయే కాలంలో దేశంలో నెంబర్ వన్ గా నిలువబోతోందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లను తొమ్మిదేళ్ళ కాలంలో ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోడీ ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు వెళ్తోందన్నారు.
Bhagavanth Kesari: బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!