పంజాబ్‌లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి. సి-3 కోచ్ కిటికీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో రెండు కిటికీలు దెబ్బతిన్నాయి. గురుగ్రామ్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు.. రైలులోని C3 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. తాము ఫగ్వారా నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన వెంటనే, తమ సీటు దగ్గర పెద్ద శబ్దం వినిపించిందని చెప్పారు. మొదట్లో ఏం జరిగిందో అర్థం కాలేదని.. ఆ తర్వాత బయటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారని చెప్పారు.
Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
అయితే వందే భారత్ రైలుపై రాళ్లను విసిరింది.. కొందరు చిన్నారులని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారులు కోచ్ వద్దకు చేరుకుని మొత్తం సమాచారాన్ని సేకరించారు. ఫగ్వారా-గురయా రైల్వే ట్రాక్‌పై చాలా కాలంగా ఏ రైలుపై రాళ్లు రువ్విన సంఘటనలు జరగలేదు. ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. మార్చిలో నైరుతి రైల్వే (SWR) జోన్ గుండా వెళుతున్న నాలుగు వందేభారత్ రైళ్లపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
PAK vs IRE: పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు.. పాక్ పరిస్థితేంటి..?
ఎస్‌డబ్ల్యుఆర్‌లోని బెంగళూరు డివిజన్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, రైళ్ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన ఒక్కో ఘటనపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో రూర్కెలా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) తెలిపింది. దెంకనల్-అంగుల్ రైల్వే సెక్షన్‌లోని మెరమండలి మరియు బుధపాంక్ స్టేషన్‌ల మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు.