Prime Minister Narendra Modi’s Karnataka visit: రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూర్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. దక్షిణాదిలో తొలి వందేభారత్ రైలుతో పాటు బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2, నాదప్రభు కెంపెగౌడ 108 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. Read Also: Jagga Reddy:…
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (KSR) రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఐదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు.
ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడు రైలు డ్యామేజ్ అయితే తాజాగా రైలు చక్రాల వద్ద సమస్య వచ్చింది. ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు రోజుకొక కష్టం వచ్చిపడుతోంది
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముంబయి- గాంధీనగర్ మధ్య నూతనంగా ప్రారంభించిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి
Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ ల కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.
vande bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం వత్వా స్టేషన్ - మణి నగర్ మధ్య ఈ రైలు ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలపైకి వచ్చిన గేదెలను ఇంజిన్ ఢీకొట్టింది.
గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు.