కేరళకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్ సిద్ధమైంది. తిరువనంతపురం-కసర్‌కోట్ వందేభారత్ తిరువనంతపురంలో ఉదయం 5.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు కాసర్‌కోట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
అతి తక్కువ కాలంలోనే దేశంలో పాపులర్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఎక్కువైంది. రాళ్లదాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రైల్వే భద్రతాదళం అరెస్టు చేసింది. భారతీయ రైల్వేల విస్తరణతో సెమీ హైస్పీడ్‌గా పరిగణించబడే వందే భారత్ రైలు ప్రారంభమైంది.
కేరళ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్‌లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. రైల్వేశాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.