Attack on TDP Office: మరోసారి గన్నవరం గరంగరంగా మారింది.. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారని చెబుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో.. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్తా ఘర్షణకు దారి…
Vallabhaneni Vamsi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న…
చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు
ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గన్నవరం రచ్చ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. వైసీపీలో వంశీ వర్సెస్ దుట్టా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గాలుగా చీలిక కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించానని.. కానీ ఆయన హద్దు…
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు మరోసారి గరంగరంగా మారుతున్నాయి.. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా.. పాత శత్రువులు మిత్రులుగా మారుతుండగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డ పై నిప్పులు చెరిగారు.. గన్నవరం ప్రజలకు తెలుసు నేను విలనో, మంచి వాడినో తెలుసన్న ఆయన.. యార్లగడ్డది ఏమైనా మహేష్ బాబు ముఖమా..? అంటూ ఎద్దేవా చేశారు.. యార్లగడ్డ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.…