ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం గరం గరంగా మారింది. గన్నవరంలో నిన్న సాయంత్రం వరకూ ఉద్రిక్తత కొనసాగింది. టీడీపీ నేత చిన్నా కారును తగులబెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలు. మంటలను అదుపు చేశారు పోలీసులు. ఆగ్రహంతో మళ్లీ రోడ్డెక్కారు టీడీపీ కార్యకర్తలు.ప్రభుత్వానికి.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read Also: Tues Day Hanuman Chalisa Chanting Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…
పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలు.. నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్టీ కార్యాలయంలో నేతలు.. పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యాలయంలో ఉన్న బోడె ప్రసాదును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేయడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సీరియస్ అయ్యారు. వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని.. దమ్ముంటే రావాలంటూ వంశీకి బుద్దా సవాల్ చేశారు. ఎన్టీఆర్ సర్కిలుకు మీరూ రండి మేమూ వస్తాం.. కురుక్షేత్రమే అన్నారు. మీరో.. మేమో తేల్చుకుందాం. ఎవ్వరూ లేనప్పుడు పార్టీ ఆఫీసుకెళ్లడం.. దాడులు చేయడం కాదు. పకోడిగాడు.. అనడమేంటీ..? ఈ నాకొ..లకు ఏమైనా స్టేజ్ ఉందా..? అన్నారు బుద్దా వెంకన్న. దీంతో ఇవాళ ఏం జరుగుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..