ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు..
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..