కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ ను రష్యా తయారు చేసిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ కరోనాకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకుతున్నది. దీంతో రష్యా జంతువుల కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కార్నివాక్ కోవ్ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. జంతువులకు కార్నివాక్‌కోవ్ వ్యాక్సిన్‌ను జంతువులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో జంతువులలో ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని రష్యా చెబుతున్నది.