కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…
శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ,…
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయను వేగ వంతం చేస్తున్నారు. అంతేకాదు, జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ఆందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమైంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కనీసం రెండు నెలలపాటు నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వేవ్‌లు రాకుండా ఉంటాయని, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం…
ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.ఈ ప్రకటన మేరకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.మార్గదర్శకాలు :దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్రధాన్యత ఇస్తున్నారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతున్నది. 17 లక్షల మంది జనాభా కలిగిన నగరంలో కేవలం ఇప్పటి వరకు 3.08 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జనాభాలో 20శాతం…
తెలంగాణ సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్లకు ఆశపడి ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్‌లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్‌లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి…