దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లతో పాటుగా విదేశీ వ్యాక్సిన్లకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చే ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫైజర్, మోడెర్నా టీకాలు కూడా ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ టీకాలు నష్టపరిహారంపై రక్షణ కోరుతున్నాయి. ఇలాంటి రక్షణ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడంతో సీరం సంస్థకూడా తమకు ఇలాంటి రక్షణ ఇవ్వాలని కోరుతున్నది. టీకా తీసుకున్న వ్యక్తి దుష్ప్రభావాలకు గురైనపుడు టీకా సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు కేసులు కూడా ఏదుర్కొవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం ఇచ్చే రక్షణతో అలాంటి కేసులు వేయడం కుదరదు. ఇప్పటివరకు కేంద్రం ఏ టీకా సంస్థకు సష్టపరిహారంపై రక్షణ ఇవ్వలేదు. విదేశీ టీకాలకు ఇలాంటి రక్షణ ఇవ్వబోతుండటంతో సీరంతో పాటుగా దేశీయ సంస్థలకు కూడా ఇలాంటి రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.