వ్యాక్సిన్ల కోసం స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగడం చర్చగా మారింది.. అసలే వ్యాక్సిన్ల కొరత ఉండడంతో.. ఓ క్రమ పద్దతి ప్రకారం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది సర్కార్.. అయితే, ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగారు.. సూపర్ స్పైడర్స్ కు ఇవ్వాల్సిన టోకెన్‌లు తమ అనుచరుల కుటుంబసభ్యులకు ఇవ్వాలని వీరంగం సృష్టించారు.. దీంతో.. నిజమైన సూపర్ స్పైడర్స్ కు అన్యాయం జరుగుతుందంటూ వాక్సిన్ వేసేందుకు నిరాకరించారు వైద్యులు.. కానీ, మాకే ఎదురు చెపుతావా అంటూ డ్యూటీ డాక్టర్ పై.. రవికుమార్, అనిల్ చౌదరి అనే ఇద్దరు స్థానిక నేతలు వీరంగం సృష్టించారు.. నిజమైన సూపర్ స్పైడర్ లకే వ్యాక్సిన్ వేస్తామంటూ నేతలపైకి వైద్యులు ఎదురుతిరిగారు.. ఇక, పోలీసులకు కూడా రంగ ప్రవేశం చేయడంతో విదాదం సద్దుమణిగింది.. అయతే, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఈ ఇద్దరు నేతల దౌర్జన్యం చేయడం.. రోజూ ఇలాగే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు, సిబ్బంది.