ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2024 టార్గెట్‌గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల వ్యూహాలతోపాటు మాజీ ఐపీఎస్ వి.వి.లక్ష్మీనారాయణ కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవకుడిగా మారతానని “బాండ్ పేపర్” రాసిచ్చినా ఆయన్ని జనం ఆదరించలేదు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రైతు…