ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ ఘోర సంఘటన జరిగింది. యూపీలో తీర్థయాత్రకు వచ్చిన ఓ వృద్ధుడు ఆదమరిచి నిద్రపోతున్న ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు.
భార్య భర్తల బంధం చాలా విలువైంది.. నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన బంధం.. భార్య పై భర్తకు, భర్త పై భార్యకు ప్రేమను కలిగివుంటారు.. కొన్నిసార్లు విధి చావుతో ఇద్దరినీ విడగొడుతుంది.. కొన్నిసార్లు వారిని మర్చిపోలేక గుడి కట్టించి తమ భాగస్వామి ఇంకా బ్రతికే ఉందంటూ..వారిని దైవంగా పూజిస్తారు.. అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.. ఫతేపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్య జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు.…
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి.
గీతా ప్రెస్ ఆలయం కంటే తక్కువ కాదు, సజీవ విశ్వాసం అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. "గీతా ప్రెస్ ప్రపంచంలోని ఏకైక ప్రింటింగ్ ప్రెస్, ఇది ఒక సంస్థ మాత్రమే కాదు, సజీవ విశ్వాసం. గీతా ప్రెస్ కేవలం ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదు, కోట్లాది మందికి దేవాలయం" అని ప్రధాని అన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది.
‘కామా తురాణం నభయం నలజ్జ’ అని ఎవరు చెప్పారో తెలీదు గానీ ప్రస్తుతం సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమే అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు వావివరుసలు, కుటుంబ కట్టుబాట్లు మరిచి కామాంధులుగా మారుతున్నారు.
నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంచి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది.