గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరిని చంపేందుకు హంతకులు ఒకరోజు ముందే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ప్రయాగ్‌రాజ్ కోర్టుకు ఇద్దరినీ తీసుకెళ్లిన రోజునే షూటర్లు అతిఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు ప్రయత్నించారని సమాచారం
ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే 'ఆర్గానిక్ ఒయాసిస్' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియలు భారీ పోలీసు భద్రత మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. కొంతమంది దూరపు బంధువులు, స్థానికులను శ్మశాన వాటికలోకి అనుమతించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అతిక్ అహ్మద్ తన 19 ఏళ్ల కుమారుడి పెళ్లిని తన సోదరి కుమార్తెతో నిర్ణయించినట్లు తెలిసింది.
ఆయనకు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. కానీ రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేయాలనే నిర్ణయం దాని ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ తన కోసం వధువును వెతుక్కునేలా చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందని, ప్రపంచం దేశం వైపు చూస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఓ అధికారి తనను రెండు వారాల్లో చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. 2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఏడుగురిలో అష్రఫ్ అహ్మద్ ఒకరు.
వారికి ఒకే కుమార్తె.. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమే ప్రాణమనుకున్నారు. మంచి చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడిన అనంతరం పెళ్లి చేయాలని కలలు కన్నారు. కానీ ఆ అమ్మాయి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త తల్లిదండ్రులను చంపే స్థితికి చేర్చింది.