తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి శుభవేళ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఉత్తర ద్వార దర్శనం.. వీక్షించి తరించండి..! వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BCy9VtuC6lI