Bhadradri Adhyayana Utsavam: భద్రాద్రికి ముక్కోటి శోభ సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో.. తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శన మండపం పునరుద్ధరించబడింది. ఆలయానికి రంగులు వేయడం, ప్రాంగణంలో పందిరి, స్వాగత ద్వారాల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి జనవరి 12వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. పగల్‌పత్తు, రాపత్తు, విలాసోత్సవం, విశ్వరూప సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న మత్స్యావతారంలో, 24న కూర్మావతారంలో, 25న వరాహావతారంలో, 26న నరసింహావతారంలో, 27న వామనావతారంలో, 28న పరశురామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 3వ తేదీ బాలరామావతారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Read also: Kaikala Satyanarayana: నవరస నటనాసార్వభౌముడు… సత్యనారాయణ!
జనవరి 1వ తేదీన తిరుమంగైళ్వార్ పరమ పదోత్సవం, అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో పగల్ పట్టు ఉత్సవాలు ముగుస్తాయి. 2వ తేదీ ఉదయం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ ఉంటుంది. రాత్రి 8.00 గంటలకు డీఎస్పీ బంగ్లాలో రాపట్టు ఉత్సవం ప్రారంభమవుతుంది. 3న అంబాసత్రం, 4న కృష్ణ దేవాలయం, 5న తహసీల్దార్ నివాసం ఎదురుగా శ్రీరామదాసు మండపం, 6న తాత గుడిసెంటర్‌లోని గోవింద మండపం, 7న పునర్వసు మండపం, 8న అభయాంజనేయ స్వామి ఆలయ శ్రీరామదూత మండపం వద్ద రాపట్టు ఉత్సవం నిర్వహిస్తారు.9న కల్కి అవతారం, దొంగల ఉత్సవం, విశ్రాంత మండప సేవ ఉంటాయి. 10న దమ్మక్క మండపంలో, 11న చిత్రకూట మండపం, ఉభయ వేదాంతాచార్య పీఠం, జీయర్ మఠం వారి ఉత్సవం, రాత్రి శ్రీ నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, రాపట్టు, సాతుమొరాయి నిర్వహిస్తారు. 12న గ్రామపంచాయతీ కార్యాలయంలోని శ్రీనృసింహదాస మండపంలో ఇరామానుసంతండాది సేవ ఉంటుందన్నారు. 13, 14, 15 తేదీల్లో రామయ్య ఉత్సవం నిర్వహిస్తారు. 19న విశ్వరూప సేవను ఘనంగా నిర్వహిస్తారు.
India Population: మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. రెండో స్థానానికి చైనా