రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు.
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.…
Sambhal violence: గతేడాది నవంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ పట్టణలో అల్లర్లు చెలరేగాయి. ఈ అలర్లకు కేరాఫ్‌గా ‘‘షాహీ జామా మసీదు’’ మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
DSP Deepti Sharma: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ క్రీడల్లో భారతదేశానికి చేసిన సేవలకుగాను ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులయ్యారు. దింతో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెండో భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది. కొద్ది రోజుల క్రితమే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణలో డీఎస్పీగా నియమితులైన సంగతి తెలిసిందే. Also Read: Virat Kohli: సింగిల్ డిజిట్‌కే కింగ్ కోహ్లీ ఔట్..…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, ఏటీఎస్‌లు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసికంగా బలహీనురాలు అని పోలీసులు చెబుతున్నారు. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపేస్తామని నిందితురాలు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్ చేసింది.
లవ్ జిహాద్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ కామప్రాయానికి బలిపశువులను చేసేవారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రోజూ సాయంత్రం తమ కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్తతో గొడవ పడి తన ఇద్దరు పిల్లలను తీసుకుని యమునా నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకుంది.