ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రోజూ సాయంత్రం తమ కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం అవ్వగానే.. గృహోపకరణాలతో పాటు ఇంటి చుట్టూ పార్క్ చేసిన వాహనాల చక్రాలకు కూడా పంక్చర్ చేస్తుందని పేర్కొన్నారు. భూతవైద్యం కూడా పనిచేయలేదన్నారు. పోలీసుల సలహా మేరకు కుటుంబసభ్యులు బాలికతో కలిసి బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి చేరుకోగా.. విషయం వేరేగా మారింది.
READ MORE: RSS: మహారాష్ట్రలో బీజేపీ ఫలితాలకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణం.. ఆర్ఎస్ఎస్ విమర్శలు..
బెల్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి కుటుంబ సభ్యులు గత ఎనిమిది నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని పోలీసులకు తెలిపారు. ఇదంతా విన్న పోలీసులు యువతిను మెడికల్ కాలేజీలోని మానసిక వ్యాధి విభాగానికి తీసుకెళ్లమని సూచించారు. కుటుంబీకులు ఆమెను మనోరోగచికిత్స విభాగం వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఆమె వైద్యులతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్న విషయాన్ని చెప్పింది.
READ MORE:Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..
“యువతి సోదరుడు బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. వారి కోరిక మేరకు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. తన సోదరుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సోదరుడు ఈ యువతి ప్రేమించుకున్నారు. అదే అబ్బాయితో తనకు పెళ్లి చేయాలని అడిగింది. కానీ యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఈ సంఘటన తరువాత.. కుమార్తె అనారోగ్యానికి గురికావడం ప్రారంభించింది. ఆమె ఎంచుకున్న అబ్బాయిని వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అమ్మాయి షాక్ కు గురైంది. అందుకే ఆమె అనుచితంగా ప్రవర్తిస్తోంది.” అని వైద్యులు గుర్తించారు.
READ MORE:IAS Puja Khedkar: తెరపైకి మరో వివాదం.. నకిలీ రేషన్ కార్డుతో ఏం చేసిందంటే..!
ఈ విషయమై బీఆర్‌డీ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిల్ హయత్‌ఖాన్ మాట్లాడుతూ.. “కుటుంబ సభ్యులు తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి అమ్మాయి నిరాకరించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ వ్యాధిని డిస్సోసియేషన్ అంటారు. దీని కారణంగా, రోగికి శరీరంలో తిమ్మిరి ప్రారంభమవుతుంది. మనసు రకరకాల ఆలోచనలతో నిండిపోతుంది. అటువంటి పరిస్థితిలో, రోగి కొన్ని వింత కార్యకలాపాలను ఆనందించడం ప్రారంభిస్తారు.” అని పేర్కొన్నారు.