Yogi Adityanath: దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని సీఎం యోగి సూచించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సమాజిక వర్గాలకు చెందిన ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారన్నారు. ఇది అల్లర్లకు తలొగ్గే ప్రభుత్వం కాదన్నారు.
Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్‌డోజర్ యాక్షన్‌పై ప్రయాగ్‌రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా…
దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని నగరాల్లో రాత్రిపూట రోడ్లపై కార్లను పార్క్ చేసే వారిపై ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట వాహనాలను పార్కింగ్ చేసే వారి నుంచి ప్రభుత్వం పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంది.
కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్‌లను అమర్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాంలాల దర్శనం కోసం రామాలయం వెలుపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Ayodhya Airport : ప్రస్తుతం ఎవరి నోట విన్నా అయోధ్య గురించే చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో రామమందిరాన్ని ప్రారంభం, రామ్‌లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇవి ఇలా ఉండగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనలో ఉన్నారు.
రంజాన్ పండగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్, అక్షయ తృతీయ వంటి రాబోయే పండుగల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది.