Caste Census : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే.. ఈరోజు సమగ్ర కులగణన సర్వేపైన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు…
Uttam Kumar Reddy : తెలంగాణ కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతంగా ఉన్నట్లు చూపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తాజా కులగణన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వేలో బీసీ…
SC Classification: ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత హనుమంతు రావు రియాక్షన్.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. “తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా…
Uttam Kumar Reddy : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత…
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు…
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం.
బీజేపీలో చేరిన మేయర్, కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి?…
Uttam Kumar Reddy : తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి…
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలు జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఇరిగేషన్ కు తీరని అన్యాయం జరిగిందని, లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే వాళ్ళ టైమ్ లో కట్టిన ప్రాజెక్టు.. కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్…