అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. కొన్ని ముఖ్య శాఖలకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష.
నేడు ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో మంత్రి ఉత్తమ్ సమావేశం. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అఖిలపక్ష ఎంపీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్‌తో పాటు పాల్గొననున్న ఆల్ పార్టీ ఎంపీలు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు బీజేపీ, BRS ఎంపీలకు లేఖ రాసిన మంత్రి ఉత్తమ్.
నేడు సిట్ ముందుకు బీజేపీ నేతలు. ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ హాజరయ్యే అవకాశం. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తింపు. 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు. బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు సైతం ట్యాప్. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు. బీజేపీ నేతలకు ఆర్ధికసహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాపింగ్. ట్యాప్ చేసిన సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసిన ప్రభాకర్ రావు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని BRS నాయకులకు సమాచారం ఇచ్చిన భుజంగరావు.
నేటి నుంచి ఈనెల 30 వరకు తెలంగాణ టెట్ పరీక్ష. 9 రోజులపాటు 15 సెషన్లలో జరగనున్న తెలంగాణ టెట్ పరీక్ష.
బెంగళూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు. చెవిరెడ్డిని అరెస్టు చేసి విజయవాడ తీసుకుని వస్తున్న సిట్ అధికారులు. లిక్కర్ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి. చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడును అరెస్టు చేసిన సిట్. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం.
నేడు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన. కుంటయ్య మృతదేహానికి నివాళులర్పించనున్న కేటీఆర్. తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య.
నేడు సజ్జల ముందస్తు బెయిల్‌పై విచారణ. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సజ్జల.
నెల్లూరు: నేడు కాకాణి బెయిల్ పిటషన్‌పై విచారణ. అక్రమ మైనింగ్, సీఐడీ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న కాకాణి.
హైదరాబాద్: నేడు మరొకసారి సిట్ ఎదుట హాజరుకాబోతున్న ప్రభాకర్ రావు. ఇప్పటికే మూడుసార్లు విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్. నేడు నాలుగోసారి సిట్ ఎదుట హాజరుకాబోతున్న ప్రభాకర్ రావు. ప్రణీత్‌రావును కూడా నేడు విచారించనున్న సిట్.
పల్నాడు: నేడు సత్తెనపల్లి (మం) రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పలువురు నేతలకు పోలీసులు నోటీసులు. ఆంక్షల నేపథ్యంలో జనసమీకరణపై నేతలకు సూచనలు. ఎవరైనాయ ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు.
విజయవాడ: నేడు సీపీఐ(యం) రాష్ట్రస్థాయి సమావేశం. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న రెండు రోజుల సమావేశం. సభలో పాల్గొననున్న పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, యు.వాసుకి, రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా స్థాయిలో ప్రజాసంఘాల నాయకులు, రాష్ట్ర పరిస్థితుల, తాజా పరిణాలపై చర్చ.
నేడు ఏలూరులో కేంద్ర సాధికారిక కమిటీ రెండో రోజు పర్యటన. కొల్లేరు గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న కమిటీ. ఏలూరు కలెక్టరేట్‌లో కొల్లేరు స్థితిగతులపై అధికారులతో సమీక్ష.