Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మగపులి జానీ మహారాష్ట్ర కు వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.…
Minister Harish Rao Public Meet at Utnoor: అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుస సభలలో పాల్గొంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. నేడు మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, కాంగ్రెస్‌కే ఓటు…