Adilabad: ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
- ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు..
- ఒకవైపు మగ పులి, మరో వెైపు ఆడపులి..
- తోడు కోసం ఆరాటం వందల కిలో మీటర్ల ప్రయాణం..
- అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి..
- అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం..
- అడవులు, కొండలు, గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్న పులులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తోడు కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పులులు అడవులు, కొండ,గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్నట్లు తెలిపారు. మెటింగ్ సీజన్ కావడంతో ఆ రెండు కలుస్తాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుండి నిర్మల్, బోథ్ సరిహద్దు మండలాల్లోకి ప్రవేశించన పులి జానీగా గుర్తించారు. గత నెల 23 న తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
మరో వైపు రెండు నెలల క్రితం కొమురం భీం జిల్లా కెరమేరి అడవుల్లోకి వచ్చిన ఆడ పులి జోడేఘాట్ అడవుల్లో సంచరించింది. ప్రస్తుతం రెండు టైగర్స్ సమీపంకు చేరుకున్న ట్లు అధికారులు గుర్తించారు. కేవలం పదుల కిలో మీటర్ల దూరంలోనే రెండు పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. రెండు పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆయా గ్రామాల్లో పులి రక్షణపై జనంకు అవగాహన కల్పిస్తు్న్నారు. పులులకు హాని తలపెట్టే ఉచ్చులు, విద్యుత్ వైర్లు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులులకు హాని తల పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. పశువులపై పులులు దాడి చేస్తే వెంటనే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు.
Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!