ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాల్లో ఎన్ ఐఏ సోదాలు కలకలం రేపాయి.. PFI లింకులపై ఆరా తీస్తున్నారు…ఎన్ ఐ ఏ సోదాల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా బైంసా,ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి..అయితే సోదాల్లో ఏం పట్టుబడ్డాయి…ఎస్ ఐ ఇంట్లోనే అద్దెకుండే అనుమానితుడు పట్టుబడడం చర్చనీయాంశమైంది..ఇంతకీ ఆదిలాబాద్ కు ఉగ్రమూలాలున్నాయా…ఎన్ ఐఏ దాడుల్లో ఏం తేలిందనేది చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎన్ ఐఏ సోదాలు కలకలం రేపాయి.. తెల్లవారుజామునే అటు బైంసా ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో ఎన్ ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు..బైంసా మదీనా గల్లిలో ఓ ఇంట్లో తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.. ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల ఎస్ ఐ గా పనిచేస్తున్న ఇస్సాక్ ఇంట్లో అద్దెకుండే ఫిరోజ్ వ్యక్తిని విచారించారు ఎన్ ఐఏ అధికారుల బృందం..మొత్తం నలుగురు అధికారుల బృందం ఆదిలాబాద్ లో సోదాలు చేసి హార్డ్ డిస్కులు.ల్యాప్ ట్యాప్ ,కొన్ని ఫోటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఫిరోజ్ ను తీసుకెళ్ళిన ఎన్ ఐఏ అధికారులు జిల్లా జైల్ కు వెళ్లారు. అయితే అక్కడ ఏం చేశారనేదానిపై క్లారిటీ లేదు. కాసేపటికే వాహనాల్లో బయటకు వెళ్ళిపోయారు..ఇదిలా ఉంటే లోకల్ పోలీసుల వైఫల్యంవల్లనే పీఎఎప్ ఐ లింకులున్న వ్యక్తులు ఉగ్రవాదులతో సంబంధాలున్న వాళ్లు పెరిగిపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారుర. ఓ ఎస్ ఐ ఇంట్లోనే అనుమానితుడు పట్టుబడడం నిఘా వైఫల్యం కారణం అంటూ ఆరోపించారు బిజెపి నేతలు. ఆదిలాబాద్ పట్టణంలో NIA దాడుల్లో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి పోలీస్ అధికారి ఇంట్లో పట్టుబడడం స్థానిక పోలీసులు వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
Read Also:Fraud in Market: పాలమూరులో వ్యాపారుల మాయాజాలం.. తూకాల్లో గోల్ మాల్
PFI మూలాలు ఉన్నాయని, ఉగ్ర కదలికలు గురించి ఉన్నతాధికారులకు తెలిపినా స్పందించని కారణంగా వారి కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసు నిఘావ్యవస్థ పూర్తిగా విఫలమైంది. హైవేలపై దాబాలు, మార్కెట్లో కొత్త మనుషులు చిరువ్యాపారాలు చేస్తున్న వారిపై నిఘాలేదు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమైనా పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదని మీడియా సమావేశంలో ఆరోపించారు బిజెపి నేత నగేష్. ఎస్ ఐ ఇంట్లో నెల రోజుల క్రితం ఫిరోజ్ ఖాన్ అద్దెకొచ్చాడు..నిజామాబాద్ కు చెందిన ఫిరోజ్ కి ఉట్నూర్ అమ్మాయితో వివాహం అయింది. ఆ ఎస్ ఐ స్వంతూరు ఉట్నూర్ …అలాగే జిల్లా కేంద్రంలోని బోక్కల గూడలో ఫిరోజ్ కు బంధువులున్నారు..వారు చెబితే ఇళ్లు అద్దెకిచ్చానని ఎస్ ఐ తెలిపారు…అయితే అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడని చెప్పాడని అతనేం పనిచేస్తాడో తమకు తెలియదు అంటున్నారు ఎస్ ఐ బంధువులు.
ఎస్ ఐ ఇంట్లో అద్దెకుండే వ్యక్తి ని ఎన్ ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎన్ ఐఏ సైతం లింకులపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది..గతంలో హర్యానా ,పంజాబ్ నుంచి పేలుడు పదార్థాల కంటైనర్ ఆదిలాబాద్ లొకేషన్ కు వస్తుండగా హర్యనా పోలీసులు పట్టుకున్నారు..అయితే అప్పటి నుంచి ఆదిలాబాద్ కు ఉగ్రవాదులతో లింకులున్నాయనే చర్చ మొదలైంది..తాజాగా ఎన్ ఐఏ ఓవ్యక్తి అదుపులోకి తీసుకోవడం బైంసాలో సైతం ఎన్ ఐఏ సోదాలు చేయడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది..అయితే ఇంకా ఎవ్వరికైనా ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో ఎన్ ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపింది. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే ఎవరేంటో బయటపడే అవకాశం ఉంటుంది.