కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా యూరప్ దేశాలతో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు…
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.…
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40…
ప్రపంచం ఓ వైపు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. చైనా వూహాన్ లో మొదలైన కోవిడ్ వ్యాధి నెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీంతో పలు దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ కేసుల సంఖ్య క్రమంగా…
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక…
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. దోమలగూడ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ పేరుతో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఫార్మా మందులతోపాటు సప్లై చేస్తున్న కంపెనీ గుట్టుని పట్టేశారు పోలీసులు. జే ఆ ర్ ఇన్ఫినిటీ పేరుతో కంపెనీ నడిపిస్తున్న వైనం బయటపడింది. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎన్ సి బి అధికారులు షాకయ్యారు. 3.71 కోట్ల రూపాయల…
జూలో ఉండాల్సిన జంతువులు రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుంది. ఆ జంతువు ఏమీ చేయకపోయినా, దాని ఆకారం, దాని స్వభావంతో ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. అమెరికా వంటి దేశాల్లో జూలో ఉండే మొసళ్లు వంటివి అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వస్తుంటాయి. వాటిని చూసి ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడకపోయినా వాటి నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఓ జూ నుంచి వ్యాన్‌లో మరో చోటకి మొసలిని తరలిస్తుండగా హఠాత్తుగా అ మొసలి వ్యాన్…
అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర…
రష్యాను నిలువరిస్తామని, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొదటి నుంచి చెబుతూ వస్తున్నది. ఉక్రెయిన్ కోసం నాటో దళాలను సరిహద్దులకు తరలించి చాలా రోజులైంది. కానీ ఆ దళాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కాలేదు. అమెరికా సైతం తమ బలగాలను పోలెండ్‌కు తరలించింది. అయితే, రష్యాతో నేరుగా యుద్ధం చేయబోమని, ఉక్రెయిన్‌కు అవసరమైన సహకారం మాత్రమే చేస్తామని చెబుతూ వచ్చింది. నాటో, అమెరికా దేశాలు అండగా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగపాటే మిగిలింది. యుద్ధం వచ్చే…