Find A Husband: అమెరికాకు చెందిన ఓ మహిళ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తనకు భర్తను వెతికిపెడితే 5000 డాలర్లు అంటే రూ.4 లక్షలు ఇస్తా అని ప్రకటించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ లాయర్ టిల్లీ కొల్సన్ తనకు వివాహం చేసుకునేందుకు భర్తను వెతకాలని టిక్‌టాక్‌లో కోరింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీ ఈవ్ టిల్లీ-కొల్సన్ తను వివాహం చేసుకోబోయే వ్యక్తితో ఆమెను కనెక్ట్ చేయడంలో సహాయపడటానికి టిక్‌టాక్‌లో వీడియో అప్పీల్‌ను పోస్ట్ చేసింది. ఈమెకు టిక్‌టాక్ లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను ఇంతకుముందు తన స్నేహితులకు ఈ ఆఫర్ ఇచ్చానని, అయితే ప్రస్తుతం సాధారణ ప్రజలకు కూడా ఇస్తున్నానంటూ తెలిపింది. 35 ఏల్ల కౌల్సన్ తనకు కాబోయే భర్త తనతో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదని, నేను అతడికి 20 ఏళ్లలో విడాకులు ఇవ్వగలను అంటూ పోస్ట్ చేసింది.
Read Also: PUBG Love Story: సీమా హైదర్ పాకిస్తాన్ తిరిగి రావాలి.. లేకుంటే ముంబై తరహా దాడి..
తాను దాదాపుగా 5 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నానని, డేటింగ్ లో విసిగిపోయానని, కోవిడ్ నుంచి డేటింగ్ సంస్కృతిలో విచిత్రమైన మార్పులు వచ్చాయని అంటుంది కౌల్సన్. నిజమైన రిలేషన్ షిప్ కి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. తనకు కాబోయే భర్తకు 27 నుండి 40 సంవత్సరాల వయస్సు, 5.11 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పొడవు ఉండాలని, సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని, క్రీడలపై మక్కువ, పిల్లలు, జంతువులతో ప్రేమ కలిగి ఉండాలని కండీషన్స్ పెట్టింది. నేను పొడవుగా ఉన్నాను కాబట్టి పొడవైన భర్త కావాలని చెప్పింది. తాను ప్రేమ కోసం సిద్ధంగా ఉన్నానని, మతం, జాతి, విశ్వాసాలు, రాజకీయ అభిప్రాయాల గురించి తనకు పట్టింపు లేదని తెలిపింది. డ్రగ్స్ తీసుకోకూడదని కండిషన్ పెట్టింది. మ్యారేజ్ సర్టిఫికేట్ పై సంతకం చేసిన వెంటనే భర్తను వెతికిపెట్టిన వారికి రూ. 4 లక్షలు ఇస్తానంటుంది.