American Airlines plane: 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు
- యూఎస్ లో మరో విమాన ప్రమాదం
- 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు
- ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమోరికాలో వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్లైట్స్ కూలిపోవడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలతో వణికిపోతున్నారు. తాజాగా యూఎస్ లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం రెక్కలపైకి చేరుకున్నారు. ఈ ప్రమాదం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగిన తర్వాత భయానక వాతావరణం ఏర్పడింది.
Also Read:Trump: అమెరికన్ల మెడకు ఉచ్చుగా భారత్ పై ట్రంప్ విధించిన సుంకం.. ఎందుకంటే?
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్ C38 వద్ద నిలిపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1006లో ఇంజిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ ఫ్లైట్ లో ఉన్న 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానం నుంచి దిగి టెర్మినల్‌కు వెళ్లారు.
#BREAKING: American Airlines plane catches on fire at Denver airport.@COLORADO @DENVER
— RC (@RealChange__) March 14, 2025
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!