TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్‌లో చోటుచేసుకుంది.
టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఆ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు
అమెరికాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులు కూడా బాబర్ అండ్ కంపెనీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకటన కూడా తెరపైకి వచ్చింది.
US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఇంటర్నెట్లో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఇటీవల, US కాంగ్రెస్ సభ్యుడు, టేనస్సీ ప్రతినిధి జాన్ రోస్ సీరియస్ గా ప్రసంగిస్తున్నారు. వెనకున్న అతని 6 ఏళ్ల కుమారుడు చేసిన పనికి చాలా మంది నవ్వుకున్నారు.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మరోసారి QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ వర్సిటీ గత 13 ఏళ్లుగా నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
అమెరికాలో జరిగిన జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో 12 ఏళ్ల భారతీయ సంతతి బాలుడు విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బృహత్ సోమ భారీగా నగదు, ఇతర బహుమతులు గెలుచుకున్నాడు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ అడవుల్లో కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-22 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది.