Home
Us Visa
Us Visa News
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
US Visa Interviews: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కొన్ని వీసా అపాయింట్మెంట్లను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం ప్రారంభించింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించనున్న ప్రపంచవ్యాప్త శిక్షణా కార్యక్రమం కారణంగా వీసా సేవల అపాయింట్మెంట్లలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన గడువును ప్రకటించలేదు. దీంతో ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్లు పొందిన… -
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలని పరిశీలిస్తున్న ఓ ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేసేందుకు ఉపయోగించే Optional Practical Training (OPT) కార్యక్రమంపై $100,000 భారీ ఫీజు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు The Wall Street Journal నివేదించింది. అయితే ఇది ప్రస్తుతం కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్… -
US: “చట్టాన్ని ఉల్లంఘిస్తే, వీసా కోల్పోతారు”.. అమెరికా బిగ్ వార్నింగ్..
US: అమెరికా మరోసారి విదేశీ పౌరులకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దాడి, గృహహింస, ఇతర తీవ్రైన నేరాల వంటి నేరాల్లో అరెస్టులు జరిగితే, తక్షణమే వీసా రద్దుకు దారితీయవచ్చని, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హతను ప్రమాదంలో పడేస్తాయని స్పష్టం చేసింది -
Indian Students: క్లాసులకు రాకుంటే వీసా రద్దు.. భారత విద్యార్థులకు అమెరికా హెచ్చరిక..
Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్‌కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Read Also: CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి… -
US visa: ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో… -
Green Card: గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన “శాశ్వత నివాసం” కాదు: యూఎస్ వైస్ ప్రెసిడెంట్..
Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. -
Indians In US: బిక్కుబిక్కుమంటున్న భారతీయులు.. యూఎస్ నుంచి ‘‘సెల్ఫ్ డిపొర్టేషన్’’ భయం..
Indians In US: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయులను కూడా బహిష్కరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికాలోని వేలాది మంది భారతీయులు H-4 వీసా కింద మైనర్లుగా వలస వెళ్లారు. -
Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
Trump "Gold Card": డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్‌ని ప్రకటించి, మరో సంచలనానికి తెరతీశారు. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్ భారతీయులకు వరంగా ట్రంప్ చెబుతున్నారు. భారతదేశాల నుంచి వచ్చే తెలివైన విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు గోల్డ్ కార్డ్ పనిచేస్తుందని అన్నారు. వారిని నియమించుకునే కంపెనీలు గోల్డ్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా వారిని ఇక్కడే ఉంచొచ్చని ట్రంప్ చెప్పాడు. -
US F-1 Visas: భారతీయ విద్యార్థులకు భారీగా తగ్గిన అమెరికా వీసాలు..
US F-1 Visas: అమెరికాలో చదువుకోవాలనేది భారతీయ విద్యార్థుల కల. స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడని గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. అయితే, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తగ్గినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. యూఎస్ F-1 వీసాలలో 38 శాతం తగ్గినట్లు చెప్పింది. అయినప్పటికీ, అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. -
Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజ్ ఫేమస్ అయ్యారు. అమెరికా వర్జీనియాలో జరిగే మూడు రోజుల సదస్సు కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 01 వరకు 12వ AKKA వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ (WKC 2024)కి యోగిరాజ్‌కి ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అమెరికా వీసా నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శిల్ప కళా రంగంలో యోగి…
తాజావార్తలు
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
-
Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!