అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో లోపాన్ని గుర్తించనట్లు తెలిపింది. ఆ తర్వాత అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేసింది. ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయం తెలిపింది.
Also Read:Vivo Y39 5G: 6.68 అంగుళాల 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీ ఫీచర్స్ తో వచ్చేసిన వివో Y39
“కాన్సులర్ టీం ఇండియా బాట్‌లు చేసిన సుమారు 2000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తోంది . మా షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు ఫిక్సర్‌లను మేము సహించము” అని భారత్ లోని US రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మోసాల నిర్మూళనకు ప్రయత్నాలను మేము కొనసాగిస్తాము. మోసాన్ని మేము ఎంతమాత్రం సహించము అని స్పష్టం చేసింది. అమెరికా రాయబార కార్యాలయం వీసా మోసాన్ని గుర్తించిన తర్వాత, ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 27న వీసా, పాస్‌పోర్ట్ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. ఈ ఏజెంట్లు దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని “మోసం” చేశారు.
Also Read:Dubai: తన బిడ్డకు ‘‘హింద్’’ అని పేరు పెట్టిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
గత సంవత్సరం మే, ఆగస్టు మధ్య, రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి, వీసా కన్సల్టెంట్లు, డాక్యుమెంట్ విక్రేతలు, పాస్‌పోర్ట్ డెలివరీ సేవలు, విద్యా కన్సల్టెంట్లతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్న బహుళ ఐపీ చిరునామాలతో ముడిపడి ఉన్న 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాత వీసా నియామకాల రద్దు శరవేగంగా కొనసాగుతోంది.