US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బైడెన్ ప్రవర్తన సొంత పార్టీ నేతలకు నచ్చకపోవడంతో అతడ్ని అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ కీలక నేతలే డిమాండ్లు చేస్తున్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు టాక్.
Giorgia Meloni Uncomfortable: అమెరికా ప్రెసిడెంట్ శిఖరాగ్ర సమావేశానికి ఆలస్యంగా రావడం వల్లే జార్జియా మెలోని అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. దీని కారణంగా నాటో సదస్సు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందన్నారు.
దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు.
వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ ప్రోగ్రాంలో మంగళవారం ఆయన ఈ కామెంట్స్ చేశారు. జెట్ లాగ్ వల్ల వచ్చిన అలసట వల్లే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబేట్ లో సరిగ్గా వాదించలేకోపోయానని జో బైడెన్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హాట్ టాఫిక్‌గా మారింది.
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు…
శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ భేటీ కానున్నారు.
తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది.…