Netanyahu: బైడెన్ తీరును తప్పుపట్టిన ఇజ్రాయెల్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హాట్ టాఫిక్‌గా మారింది.
తన సొంత దేశాన్నే గాయపరిచేలా నెతన్యాహు విధానాలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్‌తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు.
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
తాను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే.. అది పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు. హమాస్ లెక్కల ప్రకారం.. గాజాలో 31 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య గురించి తనకెలా తెలుస్తుందని తెలిపారు.
ఇజ్రాయెల్ సైనికులు 13 వేల మంది మిలిటెంట్లను మాత్రమే హతమార్చారని నెతన్యాహు తెలిపారు.
ఇదిలా ఉంటే 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ వైఖరి సొంత దేశాన్నే గాయపరుస్తోందని ఆక్షేపించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు.
అయినా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్ వెల్లడించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల గాజాలో తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. అయితే ఆయా దేశాలు ట్రక్కుల ద్వారా ఆహ్వారం అందిస్తున్నాయి. వాటి కోసం ప్రజలు ఎగబడుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిరు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!