US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్‌కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9,…
సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్‌కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
Carona: అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్‌కు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని సోమవారం వైట్ హౌస్ తెలిపింది. అయితే అధ్యక్షుడు జో బిడెన్ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది.
అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు.
అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు.
తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో కొందరు సినీ నటులపై పంచ్‌లు వేస్తుంటారు. హస్యం కోసమే కొన్ని సెటైర్లు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంగా అవి వివాదాస్పదంగా మారిన సందర్భంగాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ టీవీ ఛానల్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ చేసిన ఓ స్కిట్ చర్చనీయాంశమైంది.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి విమానం ఎక్కబోయి మెట్లపై నుంచి జారిపడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికాకు తిరిగి పయనమయ్యారు.
ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్‌పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు మాజీ మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను వాషింగ్టన్ నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
2024లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు భారతీయ-అమెరికన్, అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రకటించారు. దీంతో, వైట్‌హౌస్‌కు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేసిన మొదటి రిపబ్లికన్‌గా ఆమె అవతరించారు.