మూగ జీవాలను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు పక్షుల్ని.. ఇంకొందరు కుక్కలను పెంచుకుంటారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు జంతువులను పెంచుకోవడం చూస్తుంటాం. తమ స్థోమతను బట్టి ఒకటి కంటే ఎక్కువగా పెంచుకునేవాళ్లు ఉంటుంటారు. మనుషుల మాదిరిగానే వాటిని చూసుకుంటారు. అయితే జంతువులను పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తుంటారు. లేదంటే కొన్ని సార్లు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న డాగ్.. ఎంత పని చేసిందో తెలిస్తే.. అయ్యో అని అనకుండా ఉండరు.
జో బైడెన్‌కు ఎంతో ఇష్టమైన కుక్క.. వైట్‌హౌస్‌లో ఇతరులకు అభ్యంతరకరంగా మారింది. అధ్యక్షుడి భవనంలో పని చేస్తున్న సీక్రెట్ సభ్యులను పలుమార్లు కరిచినట్లు దృష్టికి వెళ్లింది. ఈ కుక్క కాటు బారిన పలువురు సిబ్బంది ఇప్పటికే పలుమార్లు వైద్యం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా కాళ్లు, చేతులు, నడుపుపై పలువురికి గాయాలైనట్లు సమాచారం.
కుక్క చేసిన యవ్వారం అధ్యక్షుడు బైడెన్ దృష్టికి వెళ్లడంతో సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన ఆ డాగ్‌ను వైట్‌హౌస్ నుంచి పంపించేశారు. ఉద్యోగుల సంరక్షణ మేరకు కుక్కను వైట్‌హౌస్ నుంచి బైడెన్ పంపించేశారని సీక్రెట్ సర్వీస్ ఉద్యోగులు పేర్కొన్నారు.
ఈ డాగ్‌ను కుక్కపిల్లగా ఉన్నప్పుడు 2021లో జర్మనీ నుంచి తీసుకొచ్చారు. దీనికి కమాండర్ అని పేరు పెట్టారు. వైట్‌హౌస్‌లో ఉన్న వాతావరణానికి అనుగుణంగా సెక్యూరిటీ పెంచుకుంటూ వచ్చారు. కానీ కొద్ది రోజుల నుంచి కరవడం మొదలు పెట్టడంతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. మొత్తానికి వైట్‌హౌస్ నుంచి పంపేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.