దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు. ప్రపంచానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆయన్ని మించిన అర్హత ఎవరికీ లేదన్నారు. ట్రంప్‌ను గెలిపించకుండా ఆపడానికి అతను ఉత్తమ అభ్యర్థి తానే అని పేర్కొన్నారు. జూన్ 27న ట్రంప్ తో జరిగిన డిబేట్‌లో బైడన్ తడబడటంతో అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిని బైడెన్ తోసిపుచ్చారు. ప్రధాన డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఎవరూ వైదొలగమని చెప్పలేదన్నారు. ‘దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో’ అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు. చర్చలో జరిగిన తప్పిదాలను బైడెన్ అంగీకరించారు. తనకు అస్వస్థతగా ఉన్నందునే చర్చలో సరిగా స్పందించలేదన్నారు.
READ MORE: Malayalee From India Ott: తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మలయాళ హిట్టు సినిమా.. ఎందులో చూడాలంటే?
‘‘విదేశీ నాయకులు, జాతీయ భద్రతా మండలి అధికారులతో చర్చించాలంటే ముందుగా సన్నద్ధమయ్యేవాడిని. చర్చ సమయంలో జరిగిన పొరపాట్లకు పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో కాస్త అస్వస్థతకు గురయ్యా. ఇక, డిబేట్‌లో ట్రంప్ 28 సార్లు అబద్ధాలు చెప్పారు’’ అని తెలిపారు. తాన ప్రచారం మాత్రమే చేయడం లేదని.. ప్రపంచాన్ని నడుపుతున్నానని తెలిపారు. ఈ విషయం అతిశయొక్తిలా అనిపించినా ఇదే నిజమని ధీమా వ్యక్తం చేశారు.