తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి పరిస్థితి కూడా ఇలానే ఉంది.
వివరాలలోకి వెళ్తే.. గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ అక్రమంగా 2018లో కోల్ట్ కోబ్రా రివాల్వర్‌ని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని అలానే డ్రగ్స్ వినియోగిస్తున్నారని, ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా హంటర్ బిడెన్ పై నమోదయిన కేసులో విచారణలు జరుగుతున్నాయి.
Also Read: Divyansha: మజిలీ బ్యూటీ గ్లామర్ ట్రీట్… కుర్రాళ్ల చూపంతా అమ్మడి కాళ్ల దగ్గరే
కాగా గురువారం ఈ కేసులో హంటర్ పైన మోపబడిన ఆరోపణలు వాస్తవమని తేల్చిన US న్యాయ శాఖ హంటర్ బిడెన్‌ను దోషిగా నిర్ధారించింది.. ఈ నేపథ్యంలో కేసు వివరాలు చూస్తే.. ఈ కేసు నమోదయ్యి దాదాపు 5 కావొస్తుంది. అంతే కాదు హంటర్ బిడెన్ పైన అక్రమ ఆస్తుల కేసు, డ్రగ్స్ కేసు, ఇలా మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా హంటర్ చేసిన తప్పులు అతని తండ్రి రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.