Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వారిద్దరు ఏం మాట్లాడారో తెలియనప్పటికీ, ఈ ఏడాది చివర్లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరు మాట్లాడుకున్నారనే వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..
నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ డెమొక్రాటికన్ల తరుపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నారు.అయితే, ఇటీవల జో బైడెన్ ప్రవర్తిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఆయన స్థానంలో కమలా హారిస్, ట్రంప్‌కి సవాలుగా మారవచ్చని డెమోక్రటిక్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.