US Iran Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మళ్లీ బంకర్లో దాక్కున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అమెరికా నుంచి హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత ఖమేనీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. గత ఏడు నెలల్లో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో జూన్ 2025లో ఖమేనీ 21 రోజుల పాటు బంకర్లో తలదాచుకున్నాడు. ట్రంప్ భయంతోనే ఖమేనీ అండర్‌గ్రౌండ్‌కు షిఫ్ట్ అయ్యాడా, ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు.
US – Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ప్లాన్ చేస్తుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అగ్రదేశం ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ వైమానిక స్థావరంలో తాజాగా అమెరికా యుద్ధ విమానాల కదలిక పెరిగింది. అంతే కాకుండా, ఇరాన్లో నివసిస్తున్న తన పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలు,…
US Iran Tension: ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. మరోవైపు, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు ఇరాన్ మతపాలకులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ నిరసనల్లో దాదాపుగా 500 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఉరిశిక్షల్ని ఉపయోగించి నిరసనల్ని క్రూరంగా అణగదొక్కాలని భావిస్తోంది.…
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Trump Issues Strong Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో ప్రజలను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్లో అల్లర్ల సమయంలో ప్రజలపై…
Ayatollah Ali Khamenei: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తన సొంత దేశంలో అమెరికా అరెస్టు చేయడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్ అమెరికా అచ్చం అలాగే అరెస్ట్ చేయగలదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. ఇరాన్. ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. ఇప్పుడు ఇరాన్ వీధుల్లో ప్రభుత్వ…
Iran Protest: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని సిటీల్లో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’ అంటూ ఖమేనీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు.
అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. Also Read:Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇదిలా ఉండగా, అనేక…