యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సీఎస్‌ఈ 2024 ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన పర్సనాలిటీ టెస్ట్ ఫిబ్రవరి 8కు మార్చబడినట్లు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఆమె సర్వీస్‌ను నిలిపివేయడంతో పటు భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేస్తున్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టులో ఖేద్కర్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె పేర్కొన్నారు.
Lateral Entry Row: బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అధిపతికి లేఖ రాశారు. ఇటీవల యూపీఎస్‌సీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాలకు లాటరల్ ఎంట్రీ నియామకాల కోసం ‘‘ప్రతిభావంతులైనవారిని’’ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. 24
UPSC CSE Mains 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CSE మెయిన్ పరీక్షను UPSC 20,…
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది.