Civil Services Exam: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఓ యువతి యూనియన్ పబ్లిక్ సర్వీస్(యూపీఎస్‌సీ) రాసి ర్యాంక్ సాధించింది. కండరాల కదలికను ప్రభావితం చేసే పట్టుకతో వచ్చే ‘‘సెరిబ్రమ్ పాల్సీ’’ అనే వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని సారిక ఏకే అనే యువతి సివిల్స్ సాధించారు.
UPSC Civil Services Final Results Released: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు అనిమేష్ ప్రదాన్, మూడో ర్యాంకు దోనూరి అనన్య రెడ్డికి, నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. జనరల్ కేటగిరిలో…
సివిల్స్ నోటిఫికేషన్ (UPSC Civil Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Anand Mahindra: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో IIT JEE , UPSC తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటే వీటిని క్రాక్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ కోసం జరిగితే, మరొకటి సివల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తారు. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ‘12th ఫెయిల్’ సినిమా చూసిన తర్వాత ఈ రెండు పరీక్షలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు కోరారు.
12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్‌గా తీసిన ఈ సినిమా యూపీఎస్‌సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు, లక్ష్యాన్ని సాధించాలనే యువతకు ప్రేరణ ఇస్తోంది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో 14,600 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.
Constable Cracks Prestigious Exam: సివిల్స్ సాధించాలనేది లక్షలాది మంది కల. కానీ కొంతమందికే సొంతం అవుతుంది. పట్టుదల, దీక్ష, ఎన్నో ఏళ్ల ప్రయాస విజయాన్ని సాధించిపెడుతుంది. ఏటా కేవలం వెయ్యి పోస్టుల కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటారు.
UPSC Exam: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ‘‘ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్’’ రావడం, చివరకు వారిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశంగా మారింది.
UPSC Exam: భారతదేశంలో సివిల్స్ ఎగ్జామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఎళ్లుగా సివిల్స్ కలలతో చాలా మంది కష్టపడుతుంటారు. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరమ్మాయిల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ వచ్చింది. చివరకు వీరిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.