Bahubali Samosa: ఈ సమోసా తింటే రూ.51 వేలు మీవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను ఆ స్వీట్ షాపునకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది.. మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది..
Read Also: SSMB 28 : ఆగస్ట్ నుంచే మహేశ్, త్రివిక్రమ్ సినిమా
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన శుభమ్ కౌశల్ అనే వ్యక్తి లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్ షాపు నిర్వహిస్తున్నాడు.. రకరకాల స్వీట్లు, ఇతర తినుబండారాలను కూడా విక్రయిస్తుంటాడు.. తన షాపులో తయారు చేసే సమోసాలు చాలా ఫేమస్.. అయితే, గతంలో పబ్లిసిటీ కోసం ఓ ఫుడ్ చాలెంజ్ పెట్టాడు కౌశల్.. 4 కిలోల సమోసా తయారు చేసి.. అది తింటే రూ. 11 వేలు ఇస్తానని ప్రకటించాడు. దీంతో, కౌశల్ స్వీట్ షాపు పేరు మారుమోగిపోయింది.. మరింత మంది కస్టమర్లను ఆకర్షించింది.. అయితే, కరోనా సమయంలో.. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.. ఈ నేపథ్యంలో రకరాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడిపోయారు.. ఇప్పుడు కౌశల్ మరో ఐడియా వేశాడు.. ఈ సారి ఏకంగా 8 కేజీల సమోసా చేయించాడు.. ఆ సమోసాకు ‘బాహుబలి’ సమోసాగా పేరు పెట్టాడు.. ఆ సమోసాను అర గంటలో తింటే.. రూ. 51 వేల బహుమతి ప్రకటించడంతో.. ఆ స్వీట్ షాపు పేరు మరోమారు మారుమోగుతోంది.. మీరట్‌లోనే కాదు.. యూపీ మొత్తం, అంతేందుకు దేశవ్యాప్తంగా దానిపై చర్చ జరిగేలా చేసింది. అయితే, చాలా మంది ఆ సమోసాలను తినడానికి యత్నించి విఫలం అవుతున్నారట.. ఏకంగా 8 కిలోల సమోసా కావడంతో.. రూ.51 వేల ఫ్రైజ్ మనీ కోసం పోటీకి దిగినా.. తినలేక చేతులెత్తేస్తున్నారు.. చివరకు ఆ సమోసా ధరను చెల్లించి వెళ్లిపోతున్నారు. మొత్తంగా డబ్బుకు డబ్బు.. పబ్లిసిటీకి పబ్లిసిటీ.. అన్ని తెచ్చిపెట్టింది బాహుబలి సమోసా ఐడియా.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!