తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం క్యాంపస్ కి వెళ్లారు. ఈ సందర్బంలో విద్యార్థులు మంత్రికి అడ్డుగా వచ్చి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తంచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ హామీలు ఏమైయ్యాయంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మంత్రి క్యాంపస్…
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా ? లేదా ? అని చార్మినార్ వేదిక నుండి కేసీఆర్ కి సవాల్ విసురుతున్నానని తెలిపారు. బండి సంజయ్ పాదాయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత బస్తి కి మెట్రో రైలు రాక పోవడానికి కారణం ఒవైసీ అని… పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు…
మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన…
కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పులతో ఏపీలో పాలనా జరిగితే.. కేంద్ర నిధులతో ఏపీలో…
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ…
ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు.…
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన…
కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ అందుకున్న జి కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.. నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానన్న ఆయన.. నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను.. వారికి కృతజ్ఞుడనై ఉంటానని..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర…
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు…