కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డాతో బిల్‌గేట్స్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( NIPER) త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయంపై ఎంపీ చర్చించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్‌హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు.