కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు.. వాటిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాలలో కరోనా కట్టడి కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.
ఇక, కొత్త మార్గదర్శకాలను పరిశీలిస్తే.. గ్రామీణ స్థాయి నిఘా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో టెలి-కన్సల్టేషన్, వేగవంతమైన యాంటిజెన్ పరీక్షల నిర్వహణలో శిక్షణ లాంటి అంశాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం.. అంటువ్యాధుల కట్టడికి గ్రామీణ ప్రాంతాలలో సమాజ-ఆధారిత సేవలు, ప్రాథమిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించాలని.. ప్రతి గ్రామంలో, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ సహాయంతో ఆషా కార్యకర్తలు చురకైన పాత్ర పోషించాలని పేర్కొంది. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను గుర్తించడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించింది.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో టెలికాన్సల్టేషన్ ద్వారా రోగ లక్షణాలతో కేసులను గ్రామ స్థాయిలో పరీక్షించవచ్చునని పేర్కొంది. ఆక్సిజన్ అందక, శ్వాసకోశ ఇబ్బందులున్న కేసులను అన్ని వసతులున్న వైద్య కేంద్రాలకు పంపాలని.. కరోనా తీవ్రత, కేసుల సంఖ్యను బట్టి, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ మార్గదర్శకాల ఆధారంగా కాంటాక్ట్ ట్రేసింగ్ సాధ్యమైనంతవరకు చేయాలని ఆదేశించింది.. ఇక, కోవిడ్ రోగులలో ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యమన్న కేంద్రం.. ప్రతి గ్రామంలో తగినంత సంఖ్యలో పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచడం అవసరమని స్పష్టం చేసింది.. అన్ని క్రియాశీల కేసులకు ఐసోలేషన్ కిట్ అందించబడుతుంది.. ప్రతి కిట్‌లో పారాసెటమాల్, ఐవర్‌మెక్టిన్, దగ్గు మందు, మల్టీవిటమిన్లు మాత్రలు వంటి మందులు ఉండాలని ఆదేశించింది. తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించే వివరణాత్మక కరపత్రం, రోగి పరిస్థితిని పర్యవేక్షించే ఒక ప్రొఫార్మా, ప్రధాన లక్షణాలు కనిపించేటప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు సంప్రదించేందుకు అన్ని వివరాలు ఉండాలని.. రోగ లక్షణాలు ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయాలని.. కేసులలో మూడు రోజులు జ్వరం ఉండకూడదని.. ఇంటి దగ్గర ఐసోలేషన్ కాలం పూర్తయిన తర్వాత మరో సారి కరోనా నిర్దారణ పరీక్ష అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం.