ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పను మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. సంప్రదాయ దుస్తులతో, అచ్చతెలుగు అమ్మాయిలా లంగా ఓణి దరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ, మిస్ ఇండియా ఖాతాల ద్వారా నందిని గుప్తా పంచుకున్నారు. Also Read:Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్‌కు బీఎస్ఎఫ్ చీఫ్.. సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు..…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీత, భరతముని నాట్య శాస్త్రాలకు చోటు దక్కడంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. మన సంస్కృతి మన దేశానికి ఆత్మ లాంటిదన్నారు. ఈ సంస్కృతి ఎన్నడూ గుర్తింపు కోరుకోలేదని.. మానవాళికి మంచిని అందించడమే దాని ఉద్దేశం…
భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు.
భగవద్గీత, నాట్య శాస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు.
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని……
Water Leakage At Taj Mahal: దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది.
UNESCO: వరల్డ్ సిటీస్ డే రోజున దేశంలోని కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియెటివ్ సిటీస్ నెట్వర్క్‌లో చోటు లభించింది. 55 కొత్త నగరాల జాబితాలో ఈ రెండు నగరాలకు చోటు లభించింది. ఐక్యరాజ్యసమితి మంగళవారం ఈ జాబితాను విదుదల చేసింది. జాబితాలో భారతీయ నగరాలు చోటు సంపాదించుకోవడం గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్కృతి, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో ఈ నగరాలు నిబద్ధతను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్శిటీలో యునెస్కో 'వరల్డ్ హెరిటేజ్ సైట్' ఫలకాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును రాయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు.
UNESCO: యునెస్కో(UNESCO) ప్రపంచ వారతసత్వ సంపదలో మరో రెండు భారతీయ ప్రదేశాలకు చోటు లభించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కర్ణాటక హొయసల రాజవంశానికి చెందిన ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో(UNESCO). ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.