ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పను మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. సంప్రదాయ దుస్తులతో, అచ్చతెలుగు అమ్మాయిలా లంగా ఓణి దరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ, మిస్ ఇండియా ఖాతాల ద్వారా నందిని గుప్తా పంచుకున్నారు.
Also Read:Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్‌కు బీఎస్ఎఫ్ చీఫ్..
సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు.. ‘హైదరాబాద్‌కి నా ఒక్క రోజు ప్రయాణం కేవలం యాదృచ్ఛికంగా జరగలేదు. ధన్యవాదాలు పరమేశ్వరుడా, నన్ను మార్గనిర్దేశం చేసినందుకు. ఇది నిజంగా ఓ పిలుపు! అద్భుతమైన స్థలాన్ని సందర్శించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను అంటూ తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం శాఖ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్-2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి.