భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు.
READ MORE: BJP: త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన.. కేబినెట్ విస్తరణ కూడా ఉండే ఛాన్స్
‘‘భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. “ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమైన క్షణం. యునెస్కో ‘మెమరీ ఆఫ్ ది వరల్డ్’ రిజిస్టర్‌లో భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రం చేర్చబడటం, భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, శాస్త్రీయ జ్ఞానానికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు.” అని రాసుకొచ్చారు. భాగవద్గీత, నాట్య శాస్త్రం శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని.. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
READ MORE: Crime In Delhi: ఢిల్లీలో 24 గంటల్లోనే 3 హత్యలు.. శాంతిభద్రతలపై ఆప్ ఆగ్రహం..