ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది.. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సీఎం జగన్‌కు భయం ఎందుకు? అని నిలదీశారు.. పోరాటం చేసి వైఎస్ జన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ, ఇప్పుడు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో…
మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మీ అధికారులు హనీ ట్రాప్ లో పడినట్లుగా.. కేసీఆర్ హాని ట్రాక్ లో ఉండవల్లి పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. మంచి పండితుడు.. ఏం చూసి కేసీఆర్ దగ్గరికి ఉండవల్లి వెళ్ళాడో తెలియదంటూ ఆయన సెటైర్లు వేశారు.…
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామనే వార్తలు వస్తున్న వేళ పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, తెలంగాణలో పీకే టీం చేసిన సర్వే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. దాదాపు 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేదుకు ఈ నెల 15న ఢిల్లీకి…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్… పోలవరం నిర్మాణం పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే…
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన ఇప్పుడు కాకరేపుతోంది.. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నా.. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనలను తప్పుబట్టాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్‌కు లేఖ…