Undavalli Arun Kumar: సీఎంపై ఉండవల్లి సంచలన కామెంట్స్.. అలా అయితే రాజకీయ జీవితం ముగిసినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది.. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సీఎం జగన్‌కు భయం ఎందుకు? అని నిలదీశారు.. పోరాటం చేసి వైఎస్ జన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ, ఇప్పుడు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందన్నారు.. అయితే, ఇప్పటికైనా ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై జగన్ పోరాటం చేయాలని సూచించారు ఉండవల్లి.
Read Also: Enforcement Directorate: ఎన్నారై అకాడమీలో సోదాలపై ఈడీ ప్రకటన.. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
పోరాటం చేయకుంటే వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి… ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23 సీట్లు రావడానికి ఒక కారణంగా పేర్కొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు .. కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రం రాజీ పడకూడదు అని హితవుపలికారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తుది విచారణ జరగనుంది.. ఆరోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వేయాలని సూచించారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్. విభజన బిల్లు పాస్ చేసే సమయంలో రాజ్యసభలో టెలీ కాస్టింగ్ ఆపివేశారు.. రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీర్మానించారు. ఆనాడు రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక డివిజన్ చేశామని వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు ఉండవల్లి.. జనవరి 30, 2012లో ఏం జరిగిందో తన దగ్దర అన్ని ఆధారాలున్నాయి. ఆర్టికల్ 100 ను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లకు ఏకపక్ష రాష్ట్ర విభజనపై కోర్టులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందని.. ఎనిమిదేళ్లు అయ్యింది.. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ వేయలేదన్నారు. ఫిబ్రవరి 22 వ తేదీన రాష్ట్ర విభజన కేసును విచారించాలా.. లేదా వదలివేయాలన్నది చూద్దామని, ముందుకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం తెలిపింది.. కానీ, ఏపీ ప్రభుత్వం వదిలేయమని అఫిడవిట్ వేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.
తాజావార్తలు
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!