Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అష్ట దరిద్రాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు గుప్పించారు సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. కేంద్రానికి రాష్ట్రం నుంచి 100 రూపాయలు వెళ్తే.. వాళ్లు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది 64 రూపాయలు మాత్రమేనని దుయ్యబట్టారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకోవటం మినహా నాలాంటి వారు ఏమీ చేయలేరని ఆవేదన వ్యక్తం…
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు.
Undavalli Arun Kumar: చిట్ ఫండ్ కంపెనీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు నాపై కోపం ఎందుకు ? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ వాళ్లు చర్చకు వెనుకకు ఎందుకు తగ్గారో అర్ధం కాలేదన్నారు.. ఇక, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. టీడీపీ, వైసీపీ నేతలు తిట్టుకుంటే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ఇక, మార్గదర్శి కేసును ఈ ఏడాదిలో ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని…
Undavalli Arun Kumar: సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణాం అన్నారు సీనియర్ రజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజనకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అభివృద్ధి కారణంగా ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం…
Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్.. అయితే, సీఎం జగన్ కామెంట్లపై స్పందించనంటూనే హాట్ కామెంట్లు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్..…